News October 23, 2025
సంగారెడ్డి: పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్: డీఈఓ

విద్యార్థులు పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్ కార్యక్రమం అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలో మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఎంఓ బాలయ్య, రూమ్ టు రీడ్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>
News October 24, 2025
సంగారెడ్డి: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ల పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి లలితా కుమారి తెలిపారు. ప్రీ మెట్రిక్(9,10 తరగతులు) పోస్ట్ మెట్రిక్ (11,12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News October 24, 2025
వైన్స్‌లకు 95,285 దరఖాస్తులు

TG: రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల కోసం 95,285 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి దాదాపు 36వేలు తగ్గాయి. కాగా ఫీజు రూ.3 లక్షలకు పెంచడం, ఏపీ మద్యం పాలసీ ఎఫెక్ట్ వంటివి దరఖాస్తులు తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈసారి అప్లికేషన్లతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరుతుంది.


