News October 23, 2025
VJA: వర్షాల ఎఫెక్ట్.. అమాంతం పెరిగిన టమాటా ధరలు.!

నిన్న మొన్నటి వరకు టమాటాకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెట్టారు. అయితే, 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. 2 రోజుల క్రితం బాక్స్ టమాటా రూ.500-600 ఉండగా, ప్రస్తుతం రూ.1,200లు పలుకుతోంది. విజయవాడ మార్కెట్‌లో వినియోగదారులు KG టమాటా రూ.38-40కు కొంటున్నారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>
News October 24, 2025
సంగారెడ్డి: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ల పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి లలితా కుమారి తెలిపారు. ప్రీ మెట్రిక్(9,10 తరగతులు) పోస్ట్ మెట్రిక్ (11,12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News October 24, 2025
వైన్స్‌లకు 95,285 దరఖాస్తులు

TG: రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల కోసం 95,285 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి దాదాపు 36వేలు తగ్గాయి. కాగా ఫీజు రూ.3 లక్షలకు పెంచడం, ఏపీ మద్యం పాలసీ ఎఫెక్ట్ వంటివి దరఖాస్తులు తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈసారి అప్లికేషన్లతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరుతుంది.


