News October 23, 2025

ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్‌స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 24, 2025

మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.

News October 24, 2025

శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

image

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>

News October 24, 2025

సంగారెడ్డి: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ల పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి లలితా కుమారి తెలిపారు. ప్రీ మెట్రిక్(9,10 తరగతులు) పోస్ట్ మెట్రిక్ (11,12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.