News October 23, 2025
జగిత్యాల: తేమ శాతం ఇంత ఉంటేనే మద్దతు ధర

హార్వెస్టర్ యజమానులు పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోత ప్రారంభించాలని, మిషిన్లోని బ్లోయర్ సక్రమంగా ఆన్లో ఉంచాలని, ఆర్పీఎం 19- 20 కంటే తక్కువగా ఉండకూడదని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. జగిత్యాలలో హార్వెస్టర్ యజమానులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యంలోని తేమ 17%లోపే ఉంచితే మద్దతు ధర లభిస్తుందన్నారు.
Similar News
News October 24, 2025
మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>
News October 24, 2025
సంగారెడ్డి: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ల పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి లలితా కుమారి తెలిపారు. ప్రీ మెట్రిక్(9,10 తరగతులు) పోస్ట్ మెట్రిక్ (11,12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.


