News October 23, 2025

ఈశాన్య మూలలో చెట్లు ఉండకూడదా?

image

గృహానికి ఈశాన్య దిశలో వృక్షాలు లేకపోవడమే ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈశాన్య కోణం నిర్మలంగా ఉండాలని, అప్పుడే సూర్య కిరణాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అన్నారు. ‘ఈ మూలలో చెట్లు ఉంటే సూర్యరశ్మికి అడ్డంకి అవుతాయి. సాధారణంగా ఈ దిశలో బావి/బోరు ఉంటాయి. చెట్ల వేళ్లు నేలలోకి చొచ్చుకుపోతే జలం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆ దిశను శుభ్రంగా ఉంచాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

Similar News

News October 24, 2025

నేటి నుంచి టెట్ దరఖాస్తులు!

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుందని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న 9.30am-12pm వరకు సెషన్-1, 2.30-5pm వరకు సెషన్-2 పరీక్ష జరగనుంది. జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి.
వెబ్‌సైట్‌: <>tet2dsc.apcfss.in<<>>

News October 24, 2025

నారద భక్తి సూత్రాలు – 7

image

‘సా న కామయమానా, నిరోధ రూపత్వాత్‌’
నారదుడి ఈ భక్తి సూత్రం భగవంతుని పట్ల ప్రేమ నిస్వార్థమైనదని సూచిస్తుంది. సాధారణంగా కోరికలు అనేవి మనసును కలవరపాటుకు గురిచేస్తాయి. కానీ నిజమైన భక్తిలో కోరికలు ఉండవు. భక్తి స్వభావం మనసులోని లౌకిక కోరికలను, వాంఛలను విస్మరిస్తుంది. భగవంతునిపై మనస్సును నిలపడం ద్వారా, ఇతర ఆకర్షణలను మనస్సు దానంతటదే వదిలిపెడుతుంది. అందువల్లే నిస్వార్థమైన భక్తి చాలా గొప్పది. <<-se>>#NBS<<>>

News October 24, 2025

మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.