News October 23, 2025
కీసర: మహత్మా జ్యోతిబా ఫూలే స్కూల్‌లో కలెక్టర్ తనిఖీ

కీసర మండలం బోగారంలో నిర్వహిస్తున్న మల్కాజిగిరి, ఘట్‌కేసర్ మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మీలోని భయాన్ని విడిచి నలుగురిలో మాట్లాడడం నేర్చుకోవాలని, అది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News October 24, 2025
మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్‌తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
News October 24, 2025
నేడు..

* ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్‌లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్‌డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక
News October 24, 2025
ఇంటర్వ్యూతో NIRDPRలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.50వేలు చెల్లిస్తారు. http://career.nirdpr.in


