News October 23, 2025

VJA: ఈ ఆంబులెన్స్‌లకు డ్రైవర్లు కావలెను.!

image

విజయవాడ ESI ఆస్పత్రికి మంత్రి వాసంశెట్టి సుభాష్ CSR నిధులతో 3 అంబులెన్సులు అందజేశారు. ఇవి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ESI ఆస్పత్రుల నుంచి సేవలందించాల్సి ఉంది. అయితే, డ్రైవర్లను కేటాయించాలని మంత్రి లేఖ రాసినా, ఇప్పటికీ ఒక్క డ్రైవర్‌ను నియమించకపోవడంతో అంబులెన్సులు విజయవాడలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారులు స్పందించి ముగ్గురు డ్రైవర్లను నియమించాలని కార్మికులు కోరుతున్నారు.

Similar News

News October 24, 2025

RMPT: 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

image

రామాయంపేట పట్టణానికి చెందిన కార్తీక్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 212 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. అంతకుముందు గ్రూప్-2 ఫలితాల్లో 350 ర్యాంకు సాధించి మండల పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2018లో గ్రూప్-3, గ్రూప్-4లో ర్యాంక్ సాధించి పంచాయతీరాజ్ శాఖలో టైపిస్ట్‌గా ఉద్యోగం చేశారు.

News October 24, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

image

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 24, 2025

కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లోనే: చమర్తి

image

లిక్కర్ మాఫియా కేసులలో ఇరుక్కున్న YCP తప్పించుకోలేక కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేస్తోందని రాజంపేట TDP ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. రాజంపేటలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జయచంద్రారెడ్డిపై నకిలీ మద్యం ఆరోపణలు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఆ దమ్ము YCPకి ఉందా అని ప్రశ్నించారు. YCP హయాంలో 30 వేల మంది కల్తీ మద్యానికి బలయ్యారని ఆరోపించారు. YCP