News October 23, 2025

బేగంపేటలో హత్య.. మృతురాలు లీసాగా గుర్తింపు

image

HYD బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో అస్సాం రాష్ట్రానికి చెందిన <<18085139>>మహిళ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. కాగా మృతురాలి పేరు లీసాగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మీరు ఎవరికో సేవ చేస్తున్నానని భావిస్తే మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. నా వారికి నేను చేస్తున్నానని భావించాలి
★ భగవంతుడు లేని ప్రదేశం లేదు. ఇది భగవంతుడు కాదు అని చెప్పడానికి అవకాశమే లేదు
★ రెండు బాధల మధ్య గల విరామమే సుఖం
★ మానవత్వం చాలా ప్రవిత్రమైనది. ఇలాంటి పవిత్రమైన, ప్రియమైన, విలువైన మానవత్వాన్ని వ్యర్థం చేసుకోకూడదు!

News October 24, 2025

సూళ్లూరుపేట: కాళంగి నదిలో వ్యక్తి గల్లంతు

image

దొరవారిసత్రం(M) పోలిరెడ్డిపాలెం సమీపంలోని కాళంగి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ST కాలనీకి చెందిన ఎనిమిది మంది కమ్మకండ్రిగ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో M పోలయ్య(31) చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి నది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, MRO శైల కుమారి, SI అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు NDRF బృందానికి తెలియజేయగా గాలింపు చర్యలు చేపట్టారు.

News October 24, 2025

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో మసాజ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.