News October 23, 2025
విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
Similar News
News October 24, 2025
సిద్దిపేట: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్‌ను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందనీ జిల్లా అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HM లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. HMలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని అన్నారు.
News October 24, 2025
బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి

కర్నూలు శివారు చిన్నటేకూరులో జరిగిన ప్రమాదంలో <<18087280>>కావేరి<<>> ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ద్విచక్రవాహనం బస్సు ఇంధన ట్యాంకును ఢీకొని మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడ్డారు. 20 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంపై CM చంద్రబాబు తీవ్ర విచారం

AP: కర్నూలులో బస్సు <<18087215>>ప్రమాదంపై <<>>దుబాయ్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబుకు అధికారులు సమాచారమిచ్చారు. ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. గాయాలతో బయటపడినవారిలో జస్మిత, అకీర, రమేశ్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్, నవీన్ కుమార్, అఖిల్, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


