News October 23, 2025

ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

image

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.

Similar News

News October 24, 2025

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో మసాజ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.

News October 24, 2025

డ్రైవర్లు ప్రమాద తీవ్రత అంచనా వేయలేదు: ఎస్పీ

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనకు డ్రైవర్ల సమన్వయ లోపం కారణం కావచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనుమానం వ్యక్తం చేశారు. బస్సు బైకును ఢీకొన్న విషయాన్ని డ్రైవర్ సెకండ్ డ్రైవర్‌కు చెప్పగా సమన్వయ లోపంతో చిన్న ప్రమాదంగా భావించారన్నారు. ఈ సమయంలోనే కింద నుంచి మంటలు నిమిషాల్లో చుట్టుముట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం సెకండ్ డ్రైవర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు.

News October 24, 2025

భారత్ ఓటమికి కారణాలివే?

image

నిన్న AUS చేతిలో టీమ్‌ ఇండియా ఓటమికి ప్రధాన కారణం మెయిన్ స్పిన్నర్‌ కుల్దీప్‌ను ఆడించకపోవడమేనని తెలుస్తోంది. మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. అటు ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ జంపా 4 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ నితీశ్ కాకుండా సుందర్ ముందుగా రావడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. కోచ్ గంభీర్ నిర్ణయాలతో పాటు కొత్త కెప్టెన్ గిల్ అనుభవలేమి కనిపిస్తోంది. మీ కామెంట్?