News April 9, 2024

ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే: అలహాబాద్ హైకోర్టు

image

వివాహ విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి జరిగిందనడానికీ కన్యాదానం ప్రమాణం కాదనీ, వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే వారు దంపతులైనట్లు తెలిపింది. అత్తింటి వారు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో అశుతోశ్ యాదవ్‌ను ఉద్దేశించి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు కన్యాదానం జరగలేదని వివాహం చెల్లదని యాదవ్ వాదించగా.. హిందూ వివాహ చట్ట ప్రకారం ఏడడుగులే ముఖ్యమని పేర్కొంది.

Similar News

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’ చరణ్ పాత్రకు ఈయనే ఇన్స్పిరేషన్!

image

నేడు రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో IAS అధికారిగా చరణ్ కనిపించారు. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించగా, ఓ IASను స్ఫూర్తిగా తీసుకుని ఆ క్యారెక్టర్‌‌‌ను తీర్చిదిద్దారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ అధికారే తమిళనాడు కేడర్‌కు చెందిన TN శేషన్‌. 90వ దశకంలో భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో రాజకీయ నాయకులను గడగడలాడించారని చెబుతుంటారు. దీంతో ఆయన కెరీర్ కేసులు, వివాదాలతోనే నడిచింది.

News January 10, 2025

సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ‘జనసాధారణ్’ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఇవి చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ప్రత్యేక రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్ల పూర్తి వివరాలను పై ఫొటోలో చూడొచ్చు. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల మోత ఉండటంతో చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

News January 10, 2025

క్యాన్సర్ దరిచేరొద్దంటే ఇవి తప్పనిసరి!

image

క్యాన్సర్ కేసులు పెరుగుతుండటంతో, అది దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. ‘ప్లాస్టిక్‌కు నో చెప్పండి. స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు వస్తువులు వాడండి. సిరామిక్ వంటసామగ్రి ఎంచుకోండి. ప్యాక్ చేసిన కేకులు వద్దు. గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్స్ స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ను భర్తీ చేయండి. పండ్లు, కూరగాయలు వాడేముందు బేకింగ్ సోడా నీటిలో నానబెట్టండి’ అని తెలిపారు.