News October 23, 2025
కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదే: బల్దియా కమిషనర్

నగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదేనని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన అన్ని కమ్యూనిటీ హాల్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇకపై బల్దియా అధికారులే నిర్వహణ చేయాలని కమిషనర్ సూచించారు.
Similar News
News October 24, 2025
రాజమండ్రి: బాలికపై అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు

రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ గురువారం తెలిపారు. 20వ తేదీన దీపావళి టపాకాయల కోసం బయటకు వెళ్లిన బాలికను ముందుగానే పరిచయం ఉన్న అజయ్ కుమార్ మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వార్డెన్ ఫిర్యాదు మేరకు అజయ్, అతని స్నేహితుడు సత్య స్వామిపై కేసు నమోదు చేశారు.
News October 24, 2025
NLG: తెల్ల బంగారం.. ఇలా అయ్యిందేంటి?!

పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి.. కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 7,93,627 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో దీని ప్రభావం ప్రతి దిగుబడిపై పడిందని చెబుతున్నారు.
News October 24, 2025
ఉమ్మడి వరంగల్‌లో సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!

ఉమ్మడి WGLలో 550 మంది లైసెన్స్ సర్వేయర్లను ధృవీకరించగా, 6212 దరఖాస్తులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణ మార్పులు వంటి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. 75 మండలాలకు 54 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. HNK132, WGL120, MHBD88, JNG134, MLG34, BHPL51 మంది సర్వేయర్లను కేటాయించారు.


