News October 23, 2025

MHBD: 1800 దరఖాస్తులు.. రూ.54 కోట్లు ఆదాయం

image

జిల్లాలో 61 మద్యం షాపులకు 1800 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ తెలిపారు. MHBD 667, తొర్రూర్ 769, గూడూరు 364 స్టేషన్ల వారీగా 1800 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరంలో మొత్తం 2,589 దరఖాస్తులకు 51.78 కోట్లు, 2025లో మొత్తం 1800 దరఖాస్తులకు రూ.3 లక్షల చొప్పున రూ.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలో ఈ 27 తేదీన లక్కీ డ్రా ఉంటుందన్నారు.

Similar News

News October 24, 2025

రాజమండ్రి: బాలికపై అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు

image

రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ గురువారం తెలిపారు. 20వ తేదీన దీపావళి టపాకాయల కోసం బయటకు వెళ్లిన బాలికను ముందుగానే పరిచయం ఉన్న అజయ్ కుమార్ మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వార్డెన్ ఫిర్యాదు మేరకు అజయ్, అతని స్నేహితుడు సత్య స్వామిపై కేసు నమోదు చేశారు.

News October 24, 2025

NLG: తెల్ల బంగారం.. ఇలా అయ్యిందేంటి?!

image

పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి.. కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 7,93,627 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో దీని ప్రభావం ప్రతి దిగుబడిపై పడిందని చెబుతున్నారు.

News October 24, 2025

ఉమ్మడి వరంగల్‌లో సర్వేయర్లు వచ్చేస్తున్నారు..!

image

ఉమ్మడి WGLలో 550 మంది లైసెన్స్ సర్వేయర్లను ధృవీకరించగా, 6212 దరఖాస్తులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణ మార్పులు వంటి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. 75 మండలాలకు 54 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. HNK132, WGL120, MHBD88, JNG134, MLG34, BHPL51 మంది సర్వేయర్లను కేటాయించారు.