News October 23, 2025

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

image

* రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
* SLBC టన్నెల్‌ను పూర్తిచేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించాలని నిర్ణయం
* అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం
* కాలపరిమితి ముగియడంతో రామగుండంలోని 52ఏళ్ల నాటి థర్మల్ స్టేషన్‌ను తొలగించడానికి ఆమోదం

Similar News

News October 24, 2025

జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

జమ్మూలోని ఎయిమ్స్‌లో 80 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతలుగల అభ్యర్థులు అప్లై చేసుకుని హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/

News October 24, 2025

శ్రీరామ నామ పఠనంతో విజయం తథ్యం

image

శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆ స్వామి నామము, రూపము, గుణములు, లీలలు అన్నీ అద్భుతాలే. ఆ పరమాత్ముని వచనములు ఆదర్శ ప్రాయములు. వాటిని శ్రవణం, పఠనం, మననం చేయుట మనకు శ్రేయస్సు చేకూరుస్తుంది. ఎల్లప్పుడూ ఆ ప్రభువు రూపాన్ని, గుణాలను మనస్సులో నిలుపుకొని, ఆయన ఆదర్శములను ఆచరించిన పుణ్యాత్ములకు విజయం తథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి సద్భాగ్యము కలిగిన మానవుడు నిజంగానే ధన్యుడు. <<-se>>#Bakthi<<>>

News October 24, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

image

AP: కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదంపై<<>> రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.