News October 24, 2025

PDPL: ‘2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్లు’

image

లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఆస్‌బయోటెక్‌, విక్టోరియా ప్రభుత్వ నిర్వహణలో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో PDPL జిల్లాకు చెందిన IT మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. లైఫ్‌ సైన్సెస్‌లో 2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి, 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన విశాఖ క‌లెక్ట‌ర్

image

చిన‌గ‌దిలిలో ఈవీఎం గోదాముల‌ను కలెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, భ‌ద్ర‌తా సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

News October 24, 2025

ఏటూరునాగారం: రోడ్లపై ఆహారం.. బలౌతున్న కోతులు!

image

ఏటూరునాగారం-పస్రా మధ్య జాతీయ రహదారిపై కోతులు మృత్యువాత పడుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రతిరోజు వాహనాల వేగానికి బలౌతున్నాయి. వాహనదారులు రోడ్లపై పడవేసే ఆహారం కోసం వెళ్లే క్రమంలో వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. అడవుల్లో ఆహారం లభించక రోడ్లపై వాహనదారులు వేసే ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లపై ఆహారం వేయొద్దని చెప్పిన పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు వాపోతున్నారు.

News October 24, 2025

పారాది వద్ద రాకపోకలకు అంతరాయం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో వేగవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరగడంతో బొబ్బిలి మండలం పారాది కాజ్వే పైనుంచి వరదనీరు పారుతోంది. దీంతో వాహనాలు రాకపోకలను నిలిపి వేశారు. వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు, మినీ వాహనాలకు పాత వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు.