News October 24, 2025
జగిత్యాల: వివాహిత ఆత్మహత్య.. భర్తకు 10ఏళ్ల జైలు

జగిత్యాల జిల్లా బీరపూర్ మండలం మంగేళకి చెందిన లహరి అలియాస్ ప్రియాంకను సారంగాపూర్ మండలం కోనాపూర్‌కి చెందిన రాజేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో అదనపు వరకట్నం కోసం భర్త రాజేందర్ లహరిని వేధించడంచో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నారాయణ గురువారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Similar News
News October 24, 2025
సిద్దిపేట: మద్యం టెండర్లు.. గతంలో కంటే తక్కువ!

సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 93 మద్యం దుకాణాలకు గత సంవత్సరం 4166 వేల దరఖాస్తులు రాగ 2025-2027 సంవత్సరానికి గాను 2782 దరఖాస్తులు వచ్చాయని ప్రోహిబిషన్, ఎక్సైజ్ సుపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. గతంలో డిపాజిట్ రూ.2 లక్షలు కాగా ఈ సారి అది రూ.3 లక్షలకు పెంచడం గమనార్హం.
News October 24, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


