News October 24, 2025
ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
Similar News
News October 24, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని APSDMA తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం భారీ, ఆదివారం అతిభారీ, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
News October 24, 2025
సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.
News October 24, 2025
న్యూస్ రౌండప్

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్‌కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా


