News October 24, 2025

మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923

Similar News

News October 24, 2025

సిరిసిల్ల: పోలీసులకు వ్యాసరచన పోటీలు

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసులకు శుక్రవారం వ్యాసరసన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్ష, క్షేత్రస్థాయిలో పోలిసింగ్ బలోపేతం చేయడం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమేష్, మధుకర్ సిబ్బంది పాల్గొన్నారు.

News October 24, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు ఆమోదించగా. ఆఖరి రోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుందని ఊహించినప్పటికీ చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉండే అవకాశం ఉంది.

News October 24, 2025

మావల: గోండి భాషలో సుందరకాండ

image

అంతరించిపోతున్న గోండి భాషను కాపాడేందుకు మావల మండలం వాఘాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ కృషి చేస్తున్నారు. గౌరాపూర్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన, సుందరకాండను గోండి భాషలో “సోభత ఖడి” పేరుతో కేవలం 45 రోజుల్లో పాటల రూపంలో రచించి రికార్డు సృష్టించారు. దీనిని ఈ నెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించనున్నారు.