News October 24, 2025
NRPT: విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు: కలెక్టర్

నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయిలో స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 24, 2025
సిరిసిల్ల: పోలీసులకు వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిరిసిల్లలో పోలీసులకు శుక్రవారం వ్యాసరసన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్ష, క్షేత్రస్థాయిలో పోలిసింగ్ బలోపేతం చేయడం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమేష్, మధుకర్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 24, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు ఆమోదించగా. ఆఖరి రోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుందని ఊహించినప్పటికీ చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉండే అవకాశం ఉంది.
News October 24, 2025
మావల: గోండి భాషలో సుందరకాండ

అంతరించిపోతున్న గోండి భాషను కాపాడేందుకు మావల మండలం వాఘాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ కృషి చేస్తున్నారు. గౌరాపూర్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన, సుందరకాండను గోండి భాషలో “సోభత ఖడి” పేరుతో కేవలం 45 రోజుల్లో పాటల రూపంలో రచించి రికార్డు సృష్టించారు. దీనిని ఈ నెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించనున్నారు.


