News October 24, 2025

జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్‌‌ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.

Similar News

News October 24, 2025

న్యూస్ అప్డేట్స్

image

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్, క్రాస్‌ ఓటింగ్‌తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్‌లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.

News October 24, 2025

పవన్ కళ్యాణ్‌తో హైడ్రా రంగనాథ్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటల పాటు వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2025

సర్వీసు ఇనాం భూములకు త్వరలోనే పరిష్కారం: అనగాని

image

AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇస్తారని, దానిపై CMతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై GOM సమావేశం జరగ్గా అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.