News October 24, 2025
MNCL: 73 మద్యం షాపులకు 1,712 దరఖాస్తులు

మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 73 మద్యం షాపులకు మొత్తం 1,712 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. చివరి రోజైన నిన్న 88 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు 27న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News October 24, 2025
జగిత్యాల: 100% ఉత్తీర్ణత లక్ష్యం

జగిత్యాల జిల్లాలో పదో తరగతి 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఏంఈవో, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, సాయంత్రం తరగతులు, సిలబస్ పూర్తి, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు, నాణ్యతపూర్వక బోధన ద్వారా 100% ఉత్తీర్ణత సాధించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.
News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.


