News October 24, 2025

KMR: వైన్స్ దరఖాస్తుల గడువు ముగింపు..1502 దరఖాస్తులు

image

వైన్స్ షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. కామారెడ్డి జిల్లాలోని 49 షాపుల వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు గురువారం Way2Newsకు తెలిపారు. అయితే, గత ఏడాది వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి సంఖ్య తగ్గింది. గతేడాది 2204 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News October 24, 2025

‘SSC ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి’

image

ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఏలూరు జిల్లా విద్యాధికారి వెంకట లక్ష్మమ్మ కోరారు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ వద్ద శుక్రవారం 10 మండలాల విద్యాశాఖాధికారులతో ఆమె సమీక్షించారు. డిఎస్సీ 2025 ద్వారా కొత్తగా ఉపాధ్యాయులను నియమించి, ఖాళీలు భర్తీ చేశామన్నారు. దీంతో పరీక్షా ఫలితాలలో మంచి ఫలితాలు రావాలని కోరారు.

News October 24, 2025

MBNR: పోలీస్‌ కార్యాలయంలో రేపు ఓపెన్ హౌస్‌

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం పరేడ్‌ గ్రౌండ్‌లో ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్‌ శాఖ పనితీరు, ఆధునిక పోలీసింగ్‌ విధానాలు, సైబర్‌ క్రైమ్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

News October 24, 2025

మహబూబ్‌నగర్: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం, బస్తా, తేమ కొలిచే పరికరాల సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు.