News October 24, 2025
కృత్రిమ వర్షం గురించి తెలుసా?

క్లౌడ్ సీడింగ్ అనే విధానంలో <<18087168>>కృత్రిమ<<>> వర్షాన్ని కురిసేలా చేస్తారు. ఈ పద్దతిలో ప్రత్యేక విమానాలు నల్లని(నింబోస్ట్రాటస్) మేఘాలపైకి వెళ్లి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాల మిశ్రమాన్ని చల్లుతాయి. దీంతో ఆ మేఘాలలోని నీటి బిందువుల ఘనీభవించి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియకు 30 నిమిషాల సమయం పడుతుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం దీని కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 14, 2026
TODAY HEADLINES

*TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్
*ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్
*గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR
*BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామ్‌చందర్ రావు
*AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి: CBN
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
*PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ
*T20 WCలో ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే
News February 14, 2026
రేపే బడ్జెట్

AP: రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10.30amకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 11.15amకు శాసనసభ, మండలి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై అచ్చెన్న బడ్జెట్ ప్రవేశపెడతారు. మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి.
News February 14, 2026
మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


