News October 24, 2025
MBNR: కురుమూర్తి జాతర స్పెషల్ బస్సుల వివరాలిలా.!

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లాలోని పలు డిపోల నుంచి ఈనెల 27, 28, 29న జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల వివరాలు.. కొల్లాపూర్ డిపో నుంచి-32, MBNR-80, వనపర్తి -65, NGKL-65, NRPT-28 మొత్తం 270 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు MBNR, WNP, NGKL, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్ మొదలగు ప్రదేశాల నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు.
Similar News
News October 24, 2025
జగదేవ్‌పూర్: కొండపోచమ్మ అమ్మవారి ఆదాయం రూ.88.90 లక్షలు

శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయశాఖ అధికారులు, ఈవో రవి కుమార్, కొండపోచమ్మ గుడి కమిటీ ఛైర్‌పర్సన్ అను గీత, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో పూజా సామగ్రి రూ.23.10 లక్షలు, కొబ్బరికాయలు, అమ్మవారి ఒడిబియ్యం రూ.25.70 లక్షలు, లడ్డూ, పులిహోర రూ.30.20 లక్షలు, పువ్వులకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కల సేకరణ రూ.7.90 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు.
News October 24, 2025
గోదావరిఖని: జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సదానందం

తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన అందె సదానందం నియమితులయ్యారు. తెలంగాణ జాగృతిలో పలు పదవులకు పలువురిని నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అందె సదానందంను నియమించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు సదానందం కృతజ్ఞతలు తెలిపారు.
News October 24, 2025
సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.


