News October 24, 2025

పుల్కల్: హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

image

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ రెండవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ పీపీ కృష్ణ అర్జున్ గురువారం తీర్పు ఇచ్చారు. పుల్కల్ మండలం ఇసోజి పేట గ్రామానికి చెందిన ఓ గృహిణిని ఇద్దరూ కలిసి 2019లో హత్య చేశారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు.

Similar News

News October 24, 2025

భామిని: ‘వార్డెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం’

image

భామిని మండలంలోని ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలో అతిధి హస్టల్ వార్డెన్(పురుషుడు)పోస్టుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ గంగాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసిన అనుభవం, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డీగ్రీ ఉండాలన్నారు. ముఖాముఖి కోసం ఈనెల 28న ఉదయం 9 గంటలకు పాఠశాలకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు94909 24540 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* కర్నూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్ర్భాంతి.. రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌రావు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న 23 మంది
* సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు