News October 24, 2025
1999 నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

గుంటూరు జిల్లా పోలియో రహితంగా కొనసాగుతోంది. 1999 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పోలియో కేసులు నమోదు కాలేదు. భారతదేశం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత పోలియో ఫ్రీ దేశంగా గుర్తించబడింది. జిల్లాల విభజనకు ముందు సంవత్సరం 4,47,889 మందికి పోలియో చుక్కలు వేశారు. కాగా మన ఉమ్మడి జిల్లాలో 1999లో చిలకలూరిపేటలో చివరి కేసు నమోదయింది. అధికారులు పోలియోపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచ పోలియో దినోత్సవం.
Similar News
News October 25, 2025
బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగుల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణకు ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని ఆయన అన్నారు.
News October 25, 2025
KMR: అక్టోబర్ 27న లాటరీ

కామారెడ్డి జిల్లాలో 49 వైన్స్ షాప్ లైసెన్సుదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ OCT 27న నిర్వహించనున్నట్లు ES హనుమంత్ రావు తెలిపారు. ఈ డ్రా OCT 27న ఉ.11 గంటలకు కామారెడ్డిలోని రేణుకా దేవి కళ్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో జరుగుతుందన్నారు. ఉ.9:30 గంటలకల్లా తమ హాల్ టికెట్‌తో హాజరుకావాలన్నారు. లాటరీలో ఎంపికైన లైసెన్సుదారులు ఫీజులో 1/6వ వంతు చెల్లించాల్సి ఉంటుందని ES పేర్కొన్నారు.
News October 25, 2025
విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలి: రవిశాస్త్రి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్‌వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


