News October 24, 2025
కార్తీక మాసంలో తినకూడని ఆహారం..

కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాస దీక్షతో పాటు కొన్ని ఆహార నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన, దైవారాధనలకు అనుకూలంగా ఉండేలా ఆహారం తీసుకోవాలన్నారు. ‘ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, వంకాయ, ఆనపకాయ, మునగకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్దన్నము వంటి వాటిని తీసుకోరాదు. మినుములు, పెసలు, శెనగల, ఉలవలు, కందులు వంటి ధాన్యాలను కూడా ఉపయోగించకూడదు’ అని అంటున్నారు.
Similar News
News October 24, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* కర్నూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్ర్భాంతి.. రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌రావు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న 23 మంది
* సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు
News October 24, 2025
చల్కా భూములను సాగుకు అనువుగా ఎలా మార్చాలి?

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.
News October 24, 2025
IRCTCలో 64 పోస్టులు

IRCTC సౌత్ జోన్ పరిధిలో 64 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA, MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్) అర్హతగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. NOV 8, 12, 15, 18 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: www.irctc.com/


