News October 24, 2025
మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్‌తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
Similar News
News October 25, 2025
KTDM: అకాల వర్షాలతో అన్నదాతల కుదేలు

కొత్తగూడెం జిల్లాలో కొన్నిచోట్ల కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పట్ల శాపంలా మారాయి. ఆళ్లపల్లి మండలంలో అకాల వర్షాలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. కోతకు సిద్ధమైన వరి నీరు నిలిచి నేలవాలుతోంది. వర్షాల కారణంగా కోతలు ఆలస్యమవుతున్నాయి. అధిక తేమతో పత్తి, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
News October 25, 2025
నేటి నుంచి కవిత ‘జాగృతి జనం బాట’

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’లో పాల్గొననున్నారు. ఉ.9.30 గంటలకు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతారు. అక్కడ నుంచి మ.ఒంటి గంటకు నిజామాబాద్‌లోని ఇందల్వాయి టోల్ గేట్‌కి చేరుకున్నాక ఆమెకు కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. 4 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ యాత్రలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో ఆమె భేటీ కానున్నారు.
News October 25, 2025
వర్షాలకు జిల్లాలో 316 హెక్టార్ల వరి పంట నష్టం

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన అంచనా వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 316 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయి. మచిలీపట్నం మండలంలో 33.6 హెక్టార్లు, పెడన మండలంలో 101 హెక్టార్లు, గూడూరు మండలంలో 20 హెక్టార్లు, కంకిపాడు మండలంలో 17 హెక్టార్లు, తోట్లవల్లూరు మండలంలో 8 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అధికారులు పేర్కన్నారు


