News October 24, 2025
28న ప్రజా ఉద్యమం: భూమన

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న ‘ప్రజా ఉద్యమం’ చేపట్టనున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News October 25, 2025
జనగామ: చర్చలు సఫలం.. చదువులు పదిలం!

బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాజమాన్యాలతో చర్చించి బోధనకు ఇబ్బందులకు లేకుండా చూడాలని ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు జనగామ జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి చదువులు సాగేలా కృషి చేశారు.
News October 25, 2025
జనగామ: పెండింగ్‌లో రూ.50లక్షల స్కాలర్షిప్స్!

జనగామ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖకు సంబధించిన స్కాలర్ షిప్స్ కేవలం రూ.50లక్షలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.50లక్షలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల స్కాలర్ షిప్స్ పెండింగ్ లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రాగానే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
News October 25, 2025
జనగామ: కేంద్రాలు కరవాయే.. దళారులదే రాజ్యమాయే!

ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతు నష్టాల పాలవుతున్నారు. సకాలంలో పంట చేతికొచ్చినా అకాల వర్షాలతో కల్లాల్లో తడిసి ముద్దవుతున్నాయి. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రూ.1600 నుంచి రూ.1800లకే దళారులకు విక్రయిస్తూ జనగామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


