News October 24, 2025

RMPT: 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

image

రామాయంపేట పట్టణానికి చెందిన కార్తీక్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 212 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. అంతకుముందు గ్రూప్-2 ఫలితాల్లో 350 ర్యాంకు సాధించి మండల పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2018లో గ్రూప్-3, గ్రూప్-4లో ర్యాంక్ సాధించి పంచాయతీరాజ్ శాఖలో టైపిస్ట్‌గా ఉద్యోగం చేశారు.

Similar News

News October 25, 2025

కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.

News October 25, 2025

జర్నలిస్టులకు స్థలాలిచ్చి ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

image

AP: పేదలందరికీ ఇళ్లు, స్థలాలివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అర్హులైన వారందరికీ 2, 3 సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో GOM భేటీలో చర్చించామన్నారు. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే SC తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్‌గా ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని మంత్రి వివరించారు.

News October 25, 2025

నుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

image

నుడా వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.