News October 24, 2025

సూళ్లూరుపేట: కాళంగి నదిలో వ్యక్తి గల్లంతు

image

దొరవారిసత్రం(M) పోలిరెడ్డిపాలెం సమీపంలోని కాళంగి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ST కాలనీకి చెందిన ఎనిమిది మంది కమ్మకండ్రిగ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో M పోలయ్య(31) చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి నది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, MRO శైల కుమారి, SI అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు NDRF బృందానికి తెలియజేయగా గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News October 25, 2025

రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

image

TG: గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల(రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులను వీరి పరిధిలోకి తెచ్చింది. అటవీ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News October 25, 2025

అన్ని రాష్ట్రాలకు ‘హైడ్రా’ అవసరం: పవన్

image

హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ APతో పాటు అన్ని రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మ‌ని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. పాల‌కుల ముందుచూపు, నిబ‌ద్ధ‌తగ‌ల అధికారుల ప‌నితీరు ఏ వ్య‌వ‌స్థ‌కైనా మంచి పేరు తీసుకువస్తుందన్నారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిగా హైడ్రా రూపంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను TG ప్ర‌భుత్వం తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఇవాళ మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో పవన్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

News October 25, 2025

పెద్దపల్లిలో స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేసిన DM&HO

image

పెద్దపల్లిలోని స్కానింగ్‌ సెంటర్లను DM&HO డాక్టర్‌ వాణిశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్‌ ప్రసాద్‌ మెమోరియల్‌, లీలావతి నర్సింగ్‌ హోమ్‌, శ్రీదేవీ ఆసుపత్రి, రమా ఆసుపత్రిలో స్కానింగ్‌ యంత్రాలను పరిశీలించారు. రిజిస్టర్డ్‌ గైనకాలజిస్ట్‌ ఏ స్కాన్‌లు చేస్తున్నారా, గర్భిణులకు స్కాన్‌ చేసిన వివరాల రికార్డ్స్‌ పరిశీలించారు. ఫారం ఎఫ్‌ సరిగా నమోదు చేస్తున్నారా లేదా ఆరా తీశారు.