News October 24, 2025
ఖనిజ రంగంలో సింగరేణి మరో ముందడుగు

ఖనిజాల రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో ఆ ఖనిజాల గుర్తింపు, ప్లాంట్ నిర్మాణంపై గురువారం కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఎన్ఎఫ్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఅండ్‌ఎండీ బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకొని ఉత్పత్తి చేసేందుకు కొత్తగూడెంలో ప్రయోగాత్మక ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Similar News
News October 25, 2025
నల్గొండ: గట్టెక్కిస్తుందనుకుంటే నిండా ముంచింది..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి కురిసిన వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఐకేపీ కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. చేతికొచ్చిన వరిపైరు నేలకొరిగింది. పంట ప్రారంభంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డామని, ఇప్పుడేమో వర్షాలతో నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
News October 25, 2025
పుట్టపర్తి సాయిబాబా మంచి మాటలు

★ ఇతరులలో మంచిని చూసి, మీలో మంచిని పెంచుకోండి
★ మనిషికి చావున్నది కానీ, ఆదర్శానికి చావు లేదు
★ భగవంతుడు భక్తి ప్రియుడే కానీ, అంత సులభంగా చిక్కడు. ఒక్క ప్రేమకు మాత్రమే చిక్కుతాడు, దక్కుతాడు
★ ఏ పని చేస్తున్నప్పటికీ రామ, కృష్ణ, శివ, హరి వంటి దైవనామం మీ నాలుకపై నాట్యం చేయాలి.
News October 25, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply


