News October 24, 2025

జనగామ: మద్యం టెండర్లకు 1695 దరఖాస్తులు

image

మద్యం టెండర్ల దరఖాస్తు గురువారం అర్థరాత్రి ముగిసింది. జనగామ జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు మొత్తం 1695 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 91 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అత్యధికంగా చిన్నపెండ్యాల మద్యం దుకాణానికి 108 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.

Similar News

News October 25, 2025

NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

image

బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.

News October 25, 2025

నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

image

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.

News October 25, 2025

పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

image

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.