News October 24, 2025
MBNR: కురుమూర్తి జాతర స్పెషల్ బస్సుల వివరాలిలా.!

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లాలోని పలు డిపోల నుంచి ఈనెల 27, 28, 29న జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల వివరాలు.. కొల్లాపూర్ డిపో నుంచి-32, MBNR-80, వనపర్తి -65, NGKL-65, NRPT-28 మొత్తం 270 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సులు MBNR, WNP, NGKL, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్ మొదలగు ప్రదేశాల నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు.
Similar News
News October 25, 2025
NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

బ్రెయిన్ డెడ్ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.
News October 25, 2025
నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.


