News October 24, 2025

శ్రీరామ నామ పఠనంతో విజయం తథ్యం

image

శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆ స్వామి నామము, రూపము, గుణములు, లీలలు అన్నీ అద్భుతాలే. ఆ పరమాత్ముని వచనములు ఆదర్శ ప్రాయములు. వాటిని శ్రవణం, పఠనం, మననం చేయుట మనకు శ్రేయస్సు చేకూరుస్తుంది. ఎల్లప్పుడూ ఆ ప్రభువు రూపాన్ని, గుణాలను మనస్సులో నిలుపుకొని, ఆయన ఆదర్శములను ఆచరించిన పుణ్యాత్ములకు విజయం తథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి సద్భాగ్యము కలిగిన మానవుడు నిజంగానే ధన్యుడు. <<-se>>#Bakthi<<>>

Similar News

News October 25, 2025

ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

image

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.

News October 25, 2025

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పలు మార్పుల తర్వాత ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 25, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply