News October 24, 2025
ఓయూలో UPSC ప్రిలిమ్స్ శిక్షణ FREE

OUలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో UPSC ప్రిలిమ్స్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ డా.నాగేశ్వర్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ UPSC ప్రిలిమ్స్‌తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కళాశాలల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డా.నాగేశ్వర్ సూచించారు.
SHARE IT
Similar News
News October 25, 2025
NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

బ్రెయిన్ డెడ్ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.
News October 25, 2025
నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.


