News October 24, 2025
నేడు, రేపు భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, NGKL, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారితే.. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సున్నట్లు పేర్కొంది.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


