News October 24, 2025
బిచ్కుంద: చెరువులో మృతదేహం

బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామ చెరువులో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీటిలో శవం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన చాకలి సంతోశ్‌గా గుర్తించారు. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 25, 2025
ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.
News October 25, 2025
కరీంనగర్: సరికొత్తగా ఉపాధి ‘హామీ’

జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు తగ్గించి ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లో కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుండి GP, అంగన్వాడీ బిల్డింగ్స్, CC రోడ్లు, టాయిలెట్లు తదతర ప్రభుత్వ నిర్మాణాల్లో ఉపాధి కూలీలు పనిచేయనున్నారు. ఉమ్మడి KNR జిల్లాలో 1229 GPలో 11,27,368 మంది కూలీలు ఉండగా అందులో 5,52,932 జాబ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయి. దినసరి కూలీ రూ.307 ప్రభుత్వం నిర్ణయించింది.
News October 25, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


