News October 24, 2025
MDK: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసీఆర్ ఆరా

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న కొందరూ సజీవ దహనమై మృతి చెందడం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Similar News
News October 25, 2025
కెప్టెన్‌ను బోర్డు కన్సల్టెంట్‌గా నియమించిన పాక్

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్‌కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News October 25, 2025
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి..!

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార వర్గాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


