News October 24, 2025

NLG: పత్తి రైతులకు మార్కెటింగ్ ఏడీ కీలక సూచన

image

జిల్లాలో పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి కీలక సూచన చేశారు. సీసీఐ కేంద్రాలకు రైతులకు తీసుకొచ్చే పత్తిలో తేమశాతం 8 నుంచి 12 వరకు ఉండేలా ఆరబెట్టాలని తెలిపారు. తేమశాతం తక్కువ ఉంటేనే ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.8100 చెల్లిస్తుందన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నాక పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.

Similar News

News October 25, 2025

సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

image

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News October 25, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.