News October 24, 2025
SRD: ఉపకార వేతనాలకు దరఖాస్తు ఆహ్వానం

ఉపకార వేతనాలకు దివ్యాంగలు విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా సంక్షే మాధికారి లలితకుమారి శుక్రవారం తెలిపారు. 9,10 తరగతుల విద్యార్థులకు ప్రీమెట్రిక్, ఇంటర్, ఆపై చదువుతున్న వారికి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. దరఖాస్తుల కోసం Https://scholarships.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 25, 2025
సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.
News October 25, 2025
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News October 25, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.


