News October 24, 2025
ఖమ్మం: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న తాటి గోవర్ధన(32)ను భర్త రామారావు అనుమానించేవాడు. ఈ విషయమై తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విసుగు చెందిన రామారావు గొడ్డలితో భార్యను చంపి, అనంతరం స్థానిక ఠాణాలో లొంగిపోయాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 25, 2025
JMKT: మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

JMKT మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.
News October 25, 2025
పెద్దపల్లి జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు

తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను బలోపేతం చేయాలని శ్రీనివాసరావు కృషి చేస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకంపై అభిమానులు, ప్రజలు, జాగృతి కార్యకర్తలు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
News October 25, 2025
కామారెడ్డి: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా భాజా లలిత

కామారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ నాయకురాలు భాజా లలితను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యరు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత శుక్రవారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. భాజా లలిత మాట్లాడుతూ.. జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.


