News October 24, 2025

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భావుబీజ్ వేడుకలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ భావుబీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీపావళి తర్వాత ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల్లో ఈ సంస్కృతి ఉంది. యమధర్మరాజు తన చెల్లెలు యమున ఇంట్లో భోజనం చేసిన రోజుగా దీనిని భావిస్తారు. అన్నాతమ్ములు ఎక్కడ ఉన్నా, వారి వద్దకు వెళ్లి హారతులు ఇస్తామని స్త్రీలు చెబుతున్నారు.

Similar News

News October 25, 2025

ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News October 25, 2025

ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

image

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్‌టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

News October 25, 2025

డిప్యూటీ ఈవోల బదిలీ తాత్కాలికంగా నిలుపుదలకు కారణం అదేనా?

image

TTDలో వివిధ విభాగాల్లోని డిప్యూటీ ఈవోల బదిలీలు ఈనెల 8న జరిగినా.. రెండురోజుల తర్వాత పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు యథాస్థానంలోనే కొనసాగాలని వారికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే తాత్కాలికంగా వాయిదా చేయడానికి రాజకీయల ఒత్తిళ్లు కారణమా..? మరేమైనా కారణాలు ఉన్నాయా…? అని ఉద్యోగుల్లో చర్చ సాగుతోందట. త్వరలోనే పాలకమండలి సమావేశం అనంతరం మళ్ళీ బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.