News October 24, 2025
గ్రేటర్ తిరుపతి పై కౌన్సిల్ లో రచ్చ

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే గ్రేటర్ తిరుపతి పై చర్చ రచ్చగా ప్రారంభమైంది. మేయర్ శిరీష ప్రతిపాదన పెట్టగానే డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ప్రతిపాదన ఇప్పటిది కాదని సీఎం కు కృతజ్ఞతలతో ఆమోదం తెలపాలని కోరగా.. వైసీపీ నాయకులు గ్రేటర్ తిరుపతి నినాదాలు, ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
Similar News
News October 24, 2025
లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్ బ్రీతబుల్ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.
News October 24, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APEDA 11 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు NOV 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://apeda.gov.in/
News October 24, 2025
దీపావళి టార్గెట్.. ఉగ్ర కుట్ర భగ్నం

దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ISIS కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరుగల ఇద్దరు ISIS ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్, పబ్లిక్ పార్క్‌లో దాడి చేసేందుకు సిద్ధమైన వీరిద్దరినీ ఢిల్లీ, భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. OCT 16నే వారిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు.


