News October 24, 2025

ఇక ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్

image

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్‌కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. ఇంటర్‌లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.

Similar News

News October 24, 2025

రబీలో జొన్న సాగు – అనువైన రకాలు

image

రబీ(యాసంగి)లో తేలికపాటి నీటి తడులకు అవకాశం ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. తేమను నిలుపుకునే లోతైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర చల్కా నేలల్లో జొన్నను సాగు చేయవచ్చు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం. తాండూరు జొన్న-55, తాండూరు జొన్న-1, సి.యస్.వి 29 ఆర్, ఎన్.టి.జె-5, సి.యస్.హెచ్ 39 ఆర్, సి.యస్.హెచ్ 15 ఆర్ వంటి జొన్న రకాలు రబీ సాగుకు అనుకూలం.

News October 24, 2025

98 పోస్టులకు నోటిఫికేషన్

image

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL) 98 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు NOV 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 24, 2025

‘అమ్మపై ఒట్టేసి చెప్పు’.. ధనశ్రీపై చాహల్ సెటైర్లు

image

మాజీ భార్య ధనశ్రీకి భారత క్రికెటర్ చాహల్ రూ.4.75 కోట్ల భరణం చెల్లించడం తెలిసిందే. దీనిపై చాహల్ తాజా పోస్ట్ వైరలవుతోంది. ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉన్న భార్య భరణం అడగొద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ నిర్ణయంపై వెనక్కి వెళ్లనని అమ్మపై ఒట్టేసి చెప్పు’ అని స్మైలీ ఎమోజీలతో క్యాప్షన్ పెట్టారు. విడాకుల అనంతరం వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.