News October 24, 2025

కర్నూలులో బస్సు ప్రమాదం.. యాదాద్రి యువతి సజీవ దహనం

image

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి(D) గుండాల(M) వస్తాకొండూరు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూష సజీవ దహనమైంది. దీపావళికి సొంతూరికి వచ్చిన ఆమె, బెంగళూరు తిరుగు ప్రయాణంలో ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కింది. ఈ ప్రమాదంలో అనూష మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 25, 2025

KMR: అక్టోబర్ 27న లాటరీ

image

కామారెడ్డి జిల్లాలో 49 వైన్స్ షాప్ లైసెన్సుదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ OCT 27న నిర్వహించనున్నట్లు ES హనుమంత్ రావు తెలిపారు. ఈ డ్రా OCT 27న ఉ.11 గంటలకు కామారెడ్డిలోని రేణుకా దేవి కళ్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో జరుగుతుందన్నారు. ఉ.9:30 గంటలకల్లా తమ హాల్ టికెట్‌తో హాజరుకావాలన్నారు. లాటరీలో ఎంపికైన లైసెన్సుదారులు ఫీజులో 1/6వ వంతు చెల్లించాల్సి ఉంటుందని ES పేర్కొన్నారు.

News October 25, 2025

విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలి: రవిశాస్త్రి

image

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్‌వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News October 25, 2025

కామారెడ్డి: కులం పేరుతో దాడి..13 మందికి జైలు శిక్ష

image

కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో 13 మంది నిందితులకు NZB కోర్టు శిక్ష విధించింది. సదాశివనగర్(M) అమర్లబండలో రాజేశ్వర్ తన ఇంట్లో భోజనం చేస్తుండగా రతన్ కుమార్‌తో పాటు మరో 12 మంది కులం పేరుతో దుషించి దాడి చేశారు. ఈ కేసును కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు A1 రతన్ కుమార్‌కు 3ఏళ్ల జైలు, రూ.7,200 జరిమానా మిగతా వారికి ఏడాది జైలు, రూ.4,200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.