News October 24, 2025
వరంగల్: రైతులకు నిరాశ.. తగ్గిన మిచ్చి ధరలు..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారంతో పోలిస్తే శుక్రవారం అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి. తేజా మిర్చి క్వింటాకు గురువారం రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. అలాగే, 341 రకం మిర్చి గురువారం రూ.15,849 ధర వస్తే.. శుక్రవారం రూ.15,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,800 ధర వస్తే.. నేడు రూ.16,100కి పడిపోయింది.
Similar News
News October 25, 2025
HYD: స్వచ్ఛ భారత్ మిషన్‌లో పాల్గొననున్న GHMC

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడి కార్యక్రమంలో భాగంగా HYD మెంటర్ నగరంగా GHMC ముందుకొచ్చింది. ఈ మెరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ పట్టణాల్లో సర్వే సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.

HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.