News October 24, 2025
వర్గల్: సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలి: గవర్నర్

విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభివృద్ధి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం, కావేరి సీడ్ కంపెనీని సందర్శించి ప్రభుత్వం విద్య రంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి గవర్నర్ తెలిపారు. కావేరి యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్‌ను పరిశీలించారు.
Similar News
News October 25, 2025
బిహార్‌లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
News October 25, 2025
ఏటూరునాగారం: నడుములోతు వాగు.. వృద్ధురాలి అవస్థ..!

ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. గత 4 నెలలుగా ముంపు గ్రామాల ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఇందులో భాగంగా ఏటూరునాగారంలో జరుగుతున్న ఓ ఉచిత కంటి శిబిరానికి వెళ్లేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు నరకయాతన పడింది. నడుములోతు వాగులో దాటి యువకుల సహాయంతో ఒడ్డుకు చేరింది. వాగు తగ్గుముఖం పట్టకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు.
News October 25, 2025
హుజురాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని HZB డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును NOV 3న నడుపుతున్నట్లు DM రవీంద్రనాథ్ తెలిపారు. NOV 3న బయలుదేరిన బస్సు KNR, HYD మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తుంది. NOV 4న అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణ అనంతరం 5న తిరిగి ప్రయాణమై, 6న జోగులాంబ మీదుగా HZB చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,500. వివరాలకు డిపో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.


