News October 24, 2025
విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

విభిన్న ప్రతిభావంతులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, గిరిజన నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News October 25, 2025
ఏఐ ఫేక్ వీడియో, ఇమేజ్‌లపై ECI ఆదేశాలు

బిహార్ ఎన్నికల్లో AIవీడియోలు, ఇమేజ్‌లతో ప్రచారాలు మిన్నంటాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో EC కొత్త రూల్స్ ప్రకటించింది. వీడియో, ఇమేజ్‌ల పైభాగంలో స్పష్టమైన లేబుల్ ఉండాలి. తయారీదారు పేరుండాలి. అవమానపరిచేలా, అనుమతిలేని ఇతరుల స్వరాలు, స్వరూపాలతో ఆడియో, వీడియోలు ప్రచారం చేయరాదు. తప్పుడు కంటెంట్ ఉంటే 3గం.లో హ్యాండిళ్ల నుంచి తొలగిస్తారు. పార్టీలు వీటిపై రికార్డులు నిర్వహించాలి.
News October 25, 2025
ఈ నెల 30న జాబ్ మేళా: కలెక్టర్

ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం జాబ్ మేళా పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పొన్నూరు రోడ్ ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఇంటర్వూలు నిర్వహిస్తారన్నారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని 935 ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ గుడ్ న్యూస్‌ను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.
News October 25, 2025
విశాఖ: భారీ తుఫాను ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. ఇది అక్టోబర్ 27 నాటికి తుఫానుగా బలపడి, అక్టోబర్ 29న మచిలీపట్నం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల మేరకు, తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.


