News October 24, 2025
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Similar News
News October 26, 2025
SEC రైల్వేస్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు 46% పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే ప్లాట్‌ఫామ్ బిల్డింగ్ కంప్లీట్ అయిందని.. సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. కేంద్రం అమృత్ భారత్ స్కీమ్ కింద రూ.714.73 కోట్లతో ఈ పనులు చేపడుతోందని వివరించారు.
News October 26, 2025
మద్యం షాపులకు రేపు లక్కీ డ్రా

TG: మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రాలు తీయనున్నారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. మొత్తం 2,620 షాపులకు 95 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం.
News October 26, 2025
అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.


